కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రేమించిన గౌతమ్ కిచ్లు ని కరోనా కారణంగా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న కాజల్ చేతిలో చిరు ఆచార్య, నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీస్ ఉన్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని అవకాశాలు కాజల్ తలుపుతడుతున్నట్టుగా టాక్. ఇప్పటివరకు గ్లామర్ షో తో అదరగొట్టేసిన కాజల్ ఇకమీదట పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కె ఇంపోర్టన్స్ ఇవ్వాలని అనుకుంటుందట. అందులో భాగంగానే ఓ తమిళ మూవీని ఒప్పుకుంది అని తెలుస్తుంది.
ఆ సినిమాలో కాజల్ తల్లి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. శరవణన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ రౌడీ బేబీ గా ఉండబోతుంది అని చెబుతున్నారు. కథ మొత్తం తల్లీకూతుళ్ల సెంటిమెంట్ పైనే నడుస్తుందని.. కథ కాస్త కొత్తగా అనిపించడంతో కాజల్ కూడా ఆ సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. మరి పెళ్లి తర్వాత ఇలా కాజల్ తల్లి పాత్ర చెయ్యడం నిజంగా సాహసమనే చెప్పాలి.