శృతి హాసన్ సినిమాలకి బాగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి హిట్ మీద హిట్ కొడుతోంది. తెలుగులో వకీల్ సాబ్, క్రాక్ సినిమాలతో పర్ఫెక్ట్ కం బ్యాక్ అయిన శృతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిమ్ సలార్ లో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో శృతి హాసన్ యాక్షన్ కూడా చేయబోతుందిట. క్రాక్ ఫైట్ కన్నా సలార్ లో శృతి ఫైట్స్ అదిరిపోతాయని అంటున్నారు.
ఈమధ్యన అభిమానులకి దగ్గరగా ఉంటూ వాళ్లతో చిట్ చాట్ చేస్తున్నా శృతి హాసన్ తాజాగా అభినులతో లైవ్ షోలోకి వచ్చింది. ఆ చిట్ చాట్ లో ఓ ఫ్యాన్ శృతి హాసన్ ని మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా.. అనగా అవును.. అందుకేగా ఆ ముక్కు కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది అంటూ షాకిచ్చింది. తనకి తన ముక్కు అంటే చాలా ఇష్టం అని.. అయితే ముక్కు కోసం శృతి ఎందుకంత ఖర్చు పెట్టింది అనే అనుమానం మొదలయ్యింది. అంటే శృతి హాసన్ ముక్కు షేప్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటుంది అందుకే అంత ఖర్చు పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.