కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గతంలో ఫాన్స్ మీటింగ్స్ నిర్వహిస్తూ ఉండేవారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి రావడం కోసమే అభిమానులతో ఇంట్రాప్ట్ అవుతూ వారితో క్లోజ్ గా ఉండేవారు. గత డిసెంబర్ లో రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టే టైం కి రజినీకాంత్ హెల్త్ ప్రోబ్లెంస్ తో రాజకీయాల్లోకి రావడం విరమించుకున్నారు రజిని. ఆ తర్వాత ఆయన సినిమా షూటింగ్ లో బిజీ అయిన రజినీకాంత్ రీసెంట్ గా హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లొచ్చారు.
నిన్న ఉదయమే యుఎస్ నుండి చెన్నై కి చేరుకున్నారు రజినీకాంత్. అయితే రజినీకాంత్ ఈ నెల 12 న అభిమానులతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. అభిమాన సంఘానికి జిల్లాల అభిమానులకి ఈ మీటింగ్ కి ఆహ్వానిస్తున్నారు. అభిమాన సంఘాలతో రజినీకాంత్ తాజాగా మీటింగ్ పెడతాను అనడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రజినీకాంత్ ఇప్పుడు అభిమానులని కలవడం ఎందుకో అంటూ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. రజినీకాంత్ అన్ని అభిమాన సంఘాలతో భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.