నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ఆయనని నెల్లూరు ప్రవేట్ హాస్పిటల్ నుండి చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తుండగా.. కత్తి మహేష్ నేడు మృతి చెందినట్టుగా తెలుస్తుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్. జూన్ 26 న తెల్లవారుఝూమున ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఆయన అపోలో హాస్పిటల్ లో కోలుకుంటున్నారని, కంటికి ఆపరేషన్ జరిగింది అని, అలాగే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ లేని కారణంగా కత్తి మహేష్ కి ప్రమాదం తప్పింది అని డాక్టర్స్ చెప్పినట్టుగా ఆయన మిత్రులు తెలిపారు. ఇక ఏపీ గవర్నమెంట్ కత్తి మహేష్ హాస్పిటల్ ఖర్చులు కోసం 17 లక్షల రూపాయలను చెన్నై అపోలో హాస్పిటల్ కి చెల్లించింది. అయితే కత్తి మహేష్ ఆరోగ్యం విషమించడంతో ఆయన ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కత్తి మహేష్ మృతి పట్ల సినిమా ప్రముఖులు, తోటి క్రిటిక్స్ సంతాపం తెలియజేస్తున్నారు.