Advertisementt

ఏజెంట్ విలన్ - పుష్ప విలన్ ఒక్కరేనా

Sat 10th Jul 2021 04:08 PM
fahadh faasil,allu arjun pushpa,akhil akhil agent,agent villain,fahad villain in akhil agent movie  ఏజెంట్ విలన్ - పుష్ప విలన్ ఒక్కరేనా
Fahadh Faasil to play antagonist in Akhil Agent Movie ఏజెంట్ విలన్ - పుష్ప విలన్ ఒక్కరేనా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా పోస్ట్ కరోనా షూట్ లో పుష్ప సెట్స్ లో ఫహద్ జాయిన్ అయ్యారు. అల్లు అర్జున్ మాస్ లుక్ కి సరిపోయే లుక్ లోనే ఫహద్ ఫాజిల్ విలన్ లుక్ ఉండబోతుంది అని సమాచారం, పుష్ప తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఫహద్ ఫాసిల్... మలయాళంలో నటించిన సినిమాలన్ని వరసగా తెలుగులో దబ్ అవుతున్నాయి. అలాగే ఆయనకీ అవకాశాలు కూడా టాలీవుడ్ నుండి వెల్లువలా వస్తున్నాయట. 

తాజాగా అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో ఫహద్ ఫాసిల్ ని విలన్ రోల్ కోసం సంప్రదించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఓ కీ రోల్ కోసం మలయాళ నటుడు మమ్ముట్టిని ఏజెంట్ కోసం తెచ్చారు. ఇప్పుడు ఫహద్ అయితే సినిమాకి హైప్ వస్తుంది అని సురేందర్ రెడ్డి అండ్ ఏజెంట్ టీం ఆలోచనట, అందుకే ఫహద్ తో ఏజెంట్ విలన్ కోసం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏజెంట్ లో ఫహద్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. 

Fahadh Faasil to play antagonist in Akhil Agent Movie :

Fahadh Faasil to play villain in Akhil Agent Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ