Advertisementt

చంద్రబాబు, లోకేష్‌ పై ఫైర్ అయిన రోజా

Fri 09th Jul 2021 01:59 PM
roja,mla roja,sensational comments,revanth reddy,chandrababu naidu,lokesh  చంద్రబాబు, లోకేష్‌ పై ఫైర్ అయిన రోజా
Roja Sensational comments on Chandrababu and Lokesh చంద్రబాబు, లోకేష్‌ పై ఫైర్ అయిన రోజా
Advertisement
Ads by CJ

శుక్రవారం తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్న ఎమ్యెల్యే రోజా అక్కడ మీడియాతో మాట్లాడుతూ..  రైతులను దగా చేసిన ప్రభుత్వం చంద్రబాబుది అని.. రైతుల కోసం జగన్ నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వివిధ పథకాల ద్వారా 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిన ప్రభుత్వం జగన్‌ది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

గతంలో ఉమా, హరీష్ రావు, పోలీసులు కొట్టుకున్న విషయం లోకేష్ మర్చిపోయారా అంటూ యెద్దేవా చేశారు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిలో ఉండకుండా పారిపోయి వచ్చింది లోకేష్ తండ్రి కాదా? అని నిలదీశారు.  రేవంత్ రెడ్డి తెలుగుదేశం కోవర్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసింది రేవంత్‌కి గుర్తు లేదా? అని ప్రశ్నించారు. తమ ఇంటికి జగన్ ఏప్పుడూ రాలేదని, ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని అడిగారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కారించవలసిన బాధ్యత కేంద్రానిదే అని రోజా స్పష్టం చేశారు.

Roja Sensational comments on Chandrababu and Lokesh:

Roja Sensational comments on Revanth Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ