Advertisementt

చీటింగ్ కేసులో ఇరుక్కున్న సల్మాన్ ఖాన్

Fri 09th Jul 2021 01:08 PM
salman khan,chandigarh police,summons,bollywood hero salman khan  చీటింగ్ కేసులో ఇరుక్కున్న సల్మాన్ ఖాన్
Complaint of cheating: Chandigarh Police summons Salman Khan చీటింగ్ కేసులో ఇరుక్కున్న సల్మాన్ ఖాన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి కేసులు కొత్తేమి కాదు.. ఆయన గతంలో జింకల వేట, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుని చాలారోజులు కోర్టులు చుట్టూ తిరిగారు. అలాంటి సల్మాన్ ఖాన్ పై మరోసారి పోలీస్ కేసు నమోదైంది. అరుణ్‌ గుప్తా అనే బిజినెస్ మ్యాన్ సల్మాన్ ఖాన్ ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారని, దానికోసం 2 కోట్లకు పైగా పెట్టుబడి ఖర్చు అవుతుందని చెప్పడంతో.. సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా అని అందుకు అంగీకరించి 2 కోట్లు ఖర్చు పెట్టానని.. కానీ వాళ్ళు మోసం చేశారంటూ అరుణ్‌ గుప్తా పోలీస్ లకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బీయింగ్ హ్యూమన్ జువెల్లరీ షోరూం ఓపెన్ చేసి ఏడాది గడిచినా.. ఇంతవరకు తనకు సంబందించిన సరుకు పంపలేదని.. మొదట్లో అడిగితె.. సల్మాన్ ఖాన్ తో మీటింగ్ పెట్టిస్తామంటూ ఆ సంస్థ ఉద్యోగులు చెప్పారని, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ బ్రాంచ్ ఓపెనింగ్ కూడా వస్తారని చెప్పినా.. రాలేదు అని.. అందుకే ఆ సంస్థపై, అందులోని ఉద్యోగులపై, అలాగే సల్మాన్ పై, ఆయన సోదరిపై ఫిర్యాదు చేసినట్టుగా అరుణ్ గుప్తా చెబుతున్నారు. 

Complaint of cheating: Chandigarh Police summons Salman Khan:

Chandigarh Police summons Salman Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ