కరోనా సెకండ్ వేవ్ మరోసారి సినిమా ఇండస్ట్రీని, సినిమా రిలీజ్ డేట్స్ ని టోటల్ గా మార్చేసింది. ఈ నెలలో, మే, జూన్ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్ని ఆగస్టు కి దసరాకి షిఫ్ట్ అయ్యే సూచనలు ఉన్నాయ. ఇక దసరాకి అనుకున్నాయి క్రిష్ట్మస్ కో.. లేదంటే సంక్రాంతికో అంటున్నారు. మరి సంక్రాంతికి విడుదలవ్వాల్సిన సినిమాలు వేసవికి షిఫ్ట్ అవ్వబోతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఫిలిం హరిహరవీరమల్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.
దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు పిరియాడికల్ డ్రామా.. మూడు భాషల్లో సంక్రాతి టార్గెట్ ని రీచ్ అవడం కష్టమంటున్నారు. చాలా తక్కువ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హరిహర వీరమల్లుని ఎంతగా పరిగెత్తించినా, గ్రాఫిక్స్ వర్క్స్ అవి ఇవి అంటూ లేట్ అవ్వడం ఖాయమని, ఇంకా ఈ సినిమాకి కొన్ని సెట్స్ నిర్మాణం చెయ్యాల్సి ఉంది కాబట్టి.. సంక్రాంతికి హరిహరవీరమల్లు రావడం కుదరదని అంటున్నారు. అదే డేట్ కి ప్రస్తుతం పవన్ మలయాళ ఏకే రీమేక్ రావొచ్చని అంటున్నారు. మరి మేకర్స్ ఎలాంటి డేట్స్ పవన్ సినిమాలకి ప్లాన్ చేస్తారో చూడాలి.