తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది కథలు నవరసస సీరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. 9 ఎమోషన్స్, 9 స్టోరీస్ అంటూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్క్ష్ లో ఆగష్టు 6 రిలీజ్ కాబోతున్నట్టుగా ఓ టీజర్ ని రిలీజ్ చేసింది టీం. మణిరత్నం, జయేంద్ర నిర్మాతలుగా తెరకెక్కిన ఈ నవరస వెబ్ సీరీస్ కోలీవుడ్ లో పేరుమోసిన నటులతో, తొమ్మిదిమంది దర్శకులతో తెరకెక్కింది. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, సిద్ధార్థ్, ప్రసన్న, బాబీ సింహ, రోహిణి, నిత్య మీనన్, అరవింద్ స్వామిలాంటి నటులతో భారీగా తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కరోనా తో అతలాకుతలం అయిన సినిమా కార్మికులను ఆదుకోవడం కోసమే తెరకేక్కించినట్టుగా మణిరత్నం చెబుతున్నారు.
దర్శకుడుగా ఈ వెబ్ సీరీస్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వేలు పెట్టకూడదని.. జస్ట్ నిర్మాతలుగాని కొనసాగాలని ముందే నిర్ణయించుకున్నామని.. తొమ్మొదిమంది దర్శకుల సొంతకథతో ఈ సీరీస్ చేశామని మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి కథనిబట్టే ఎమోషన్ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఒక సినిమాలో ఉండాలనేమీ లేదు. మన జీవితాల్లో నవరసాలు ఉన్నట్టే సినిమా కథలోనూ ప్రస్ఫుటిస్తుంటాయి. అదే ఈ నవరస వెబ్ సీరీస్ లో కనిపిస్తుంది అంటూ మణిరత్నం నవరస సీరీస్ పై అంచనాలు పెంచేశారు.