గురువారం రాగానే ఆత్రంగా సోషల్ మీడియాలో జబర్దస్త్ అనసూయ అందాల కోసం తెగ వెతికేస్తారు. గురువారం ఉదయం 11 అవ్వగానే తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కవ్వించే అనసూయ నేడు యదావిదిగా తన లేటెస్ట్ ఫొటోస్ లో బేబీ పింక్ సారీ తో అదరగొట్టేసింది. అనసూయ సారీ లో ఎంతగా అందాలు చూపించాలో అంతగా అందాలు ఆరబోసింది. కవ్వించే చూపులతో కత్తిలాంటి ఫిగర్ తో అనసూయ నేటి ఫోటో షూట్ అద్భుతః. ఇక అనసూయ బుల్లితెర మీదే కాదు వెండితెర మీద జబర్దస్థ్ అందాలను ఆరబొయ్యడమే కాదు.. పెరఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుంది.
ఖిలాడీ మూవీలో రవితేజ తో ఢీ కొట్టబోతున్న అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప లో కీలక పాత్రలో నటిస్తుంది. రెండు రోజుల క్రితమే మొదలైన పోస్ట్ కరోనా షూట్ లో అనసూయ నేడు పుష్ప సెట్స్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం 45 రోజులపాటు పుష్ప షూటింగ్ సికింద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అనసూయ - అల్లు అర్జున్ - రష్మీకల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుందట టీం. పుష్ప సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట . సో అలా జబర్దస్త్ అందాలు ఇప్పుడు వెండితెర మీదకి షిఫ్ట్ అయ్యాయన్నమాట.