ఉప్పెన సంచలనం కృతి శెట్టి జోరు టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లోను మొదలైపోయింది. ఉప్పెన సినిమా రిలీజ్ కాకుండానే నాని సినిమాలో ఛాన్స్ పట్టేసిన కృతి శెట్టి.. ఆ తర్వాత RAPO19 లో రామ్ సరసన ఆఫర్ కట్టేసింది. కృతి శెట్టి పెరఫార్మెన్స్, కృతి లుక్స్ కి ఫిదా అయిన టాలీవుడ్ ఆమెకి వరస ఆఫర్స్ ఇస్తుంది. ఈమధ్యన నేను ఒప్పుకున్న సినిమా లు ఇవి తప్ప ఇంకే ప్రాజెక్ట్స్ నా చేతిలో లేవు. ఒకవేళ నేను సైన్ చేస్తే చెప్తాను అన్నది.
కానీ తాజాగా కృతి శెట్టి రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టడమే కాదు.. ఇద్దరు యంగ్ హీరోల సినిమాలకు సైన్ కూడా చేసేసిందట. అది నితిన్ కొత్త సినిమాలో ఒకటి, ఇంకొకటి నాగ చైతన్య సినిమాలో కృతి శెట్టి నటించబోతుంది. నితిన్ కొత్త దర్శకుడు కాంబోలో తెరకెక్కబోయే సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నాగార్జున బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కి జోడిగా కృతి శెట్టి పేరు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కన కృతి శెట్టి అవకాశాలు చూసి యంగ్ హీరోయిన్స్ కుళ్ళుకుంటున్నారు.