అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. రేపో మాపో ఆ మూవీ షూటింగ్ ఫినిష్ చేసేసి అక్కినేని అఖిల్.. సురేందర్ రెడ్డి ఏజెంట్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఏజెంట్ గా స్పై థ్రిల్లర్ గా అఖిల్ లుక్ అదిరింది. అయితే అఖిల్ - సురేందర్ రెడ్డి ఏజెంట్ షెడ్యూల్ గోవాలో జరగాల్సి ఉండగా.. ఇప్పుడు అది నెల్లూరు లోని కృష్ణపట్నం పోర్ట్ కి మారింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశాడని తెలుస్తుంది.
కృష్ణపట్నం లాంగ్ షెడ్యూల్ తర్వాత ఏజెంట్ టీం హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుందట. హైదరాబాద్ లో ఓ సెట్ లో ఏజెంట్ కి సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తుంటే.. ముంబై మోడల్ సాక్షి వైద్య అఖిల్ కి జోడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. అఖిల్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.