Advertisementt

ముంబై బాట పడుతున్న సమంత

Thu 15th Jul 2021 06:31 PM
samantha akkineni,mumbai sensation,samantha,flat in mumbai  ముంబై బాట పడుతున్న సమంత
Samantha to buy a flat in Mumbai? ముంబై బాట పడుతున్న సమంత
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఎన్ని అవకాశాలు వచ్చినా.. బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని హీరోయిన్ సమంత అక్కినేని.. ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం ముంబై కి వెళ్ళింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ పూర్తి చేసి అక్కడి ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత టాలీవుడ్ కి వచ్చేసి గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయో.. లేదంటే నాగ చైతన్యని బాలీవుడ్ కి షిఫ్ట్ చేసే ఏర్పాట్లు ఏమైనా మొదలు పెట్టిందో కానీ.. 

సమంత ఇప్పుడు ముంబై కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట. దాని కోసం ముంబై లో ఓ బంగ్లా కొనేందుకు చూస్తుంది అని, ముంబై లోని పోష్ ఏరియా లో అన్ని వసతులతో ఉన్న ఇంటి కోసం సమంత సెర్చింగ్ లో ఉందట. మరి ఇప్పటికే రామ్ చరణ్ ముంబై లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి.. ముంబై కి షిఫ్ట్ అవ్వబోతున్నాడనే న్యూస్ ఉండగానే ఇప్పుడు సమంత కూడా ముంబై లో ఓ ఖరీదైన ఇంటి కోసం వెతకడం హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగ చైతన్య అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీలో ఓ అతిధి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సమంత కూడా ఈ మధ్యన గ్లామరస్ ఫోటో షూట్స్ తో బాలీవుడ్ హీరోయిన్స్ కె షాకిస్తుంది. 

Samantha to buy a flat in Mumbai?:

Samantha readies for Mumbai sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ