Advertisementt

గని కోసం ఆహా అంత రేటు పెట్టిందా

Wed 07th Jul 2021 05:51 PM
varun tej,ghani movie,varun tej ghani,massive deal with aha,ghani digital rights  గని కోసం ఆహా అంత రేటు పెట్టిందా
Aha grabs Varun Tej Ghani digital rights గని కోసం ఆహా అంత రేటు పెట్టిందా
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ ఎఫ్ 3 మూవీ రెస్యూమ్ షూట్ స్టార్ట్ చేసాడు. వరుణ్ - వెంకీ - మెహ్రీన్ - తమన్నా కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 లో నటిస్తున్న వరుణ్ తేజ్ మరో స్పోర్ట్స్ డ్రామా గని కూడా రేపో మాపో సెట్స్ మీదకెళ్లబోతుంది. బాక్సర్ గా గని మూవీలో కనిపించబోతున్న వరుణ్ తేజ్ లాక్ డౌన్ లోను జిమ్ లో వర్కౌట్స్ మానలేదు. గని సినిమాపై ఈమధ్యన రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా.. గని మేకర్స్ వాటిని కొట్టిపారెయ్యడంతో ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా గని సినిమా ఆడియో రైట్స్ కి లహరి మ్యూజిక్ 1.5 కోట్లు పెట్టి కొనేసిందట. 

అంతేకాదు.. గని డిజిటల్ రైట్స్ కోసం టాలీవుడ్ ఓటిటి సంస్థ అయిన ఆహా 24 కోట్లు వెచ్చించింది అని వినికిడి. మరి ఆహా ఓటిటి నిజంగానే గని కి 24 కోట్లు పెట్టిందా? అనేది అనుమానం అన్నప్పటికీ.. గని డిజిటల్ రైట్స్ కి 24 కోట్లు డీల్ ఆహా పెట్టింది అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. వరుణ్ తేజ్ మిడియం హీరోనే. అయినా డిజిటల్ రైట్స్ కి అంత డిమాండ్ అంటే.. గని సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తుంది. 

Aha grabs Varun Tej Ghani digital rights:

Varun Tej Ghani cements a massive deal with Aha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ