Advertisementt

ఏపీ స్కూల్స్ రీ ఓపెన్.. ఎప్పటినుండి అంటే

Wed 07th Jul 2021 04:44 PM
andhra pradesh,ap schools reopen,andhra pradesh achools,cm jagan,eduction minister adimulapu suresh,august 16th  ఏపీ స్కూల్స్ రీ ఓపెన్.. ఎప్పటినుండి అంటే
Schools in Andhra Pradesh to reopen on August 16 ఏపీ స్కూల్స్ రీ ఓపెన్.. ఎప్పటినుండి అంటే
Advertisement

సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన ఆంధ్రప్రదేశ్‌ స్కూల్స్, కాలేజెస్ అన్ని ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఆంధ్ర లో స్కూల్స్ ఓపెన్ అయ్యే నిర్ణయాన్ని సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో తీసుకున్నారు. ఖ్అంతేకాకుండా ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు- నేడు పెండింగ్‌ పనుల పూర్తికి సీఎం జగన్ ఆదేశించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 

నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు చెప్పారు. . దీని వల్ల ఏ స్కూల్‌ మూతపడదని.. ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని సురేష్‌ వివరించారు. రెండేళ్లలో ఫౌండేషన్‌ స్కూళ్లకు అదనపు గదులను నిర్మిస్తామన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు 70 శాతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులు.. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

Schools in Andhra Pradesh to reopen on August 16:

Schools Reopen in Andhra Pradesh From August 16th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement