రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రెడ్ అనే మూవీ చేసాడు. రెడ్ మూవీ లో రామ్ డిఫ్రెంట్ గా ట్రై చేసాడు కానీ.. సినిమా మాత్రం రామ్ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత రామ్ ఎలాంటి కథతో, ఏ డైరెక్టర్ సినిమా చేస్తాడో అనుకున్నారు. అనూహ్యంగా రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో బైలింగువల్ మూవీ మొదలు పెట్టాడు. సెకండ్ వేవ్ కి ముందే షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా.. కరోనా విలయతాండవంతో RAPO19 షూటింగ్ మొదలు కాలేదు.
ఇక ఈమధ్యనే RAPO 19 మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడని ప్రకటించిన టీం.. తాజాగా షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుందో బిగ్ అప్ డేట్ ఇచ్చింది. అది ఈ నెల 12 నుండి RAPO19 సెట్స్ మీదకెళ్ళబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చింది టీం. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. రామ్ - కృతి శెట్టి పెయిర్ కొత్తగా ఉండబోతుంది అంటూ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు