సెకండ్ వేవ్ పోయి.. మళ్ళీ షూటింగ్స్ తో టాలీవుడ్ కళకళలాడుతుంది. మెగా హీరోలు కూడా ఒక్కొక్కరిగా సెట్స్ మీదకి వెళుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప నిన్న స్టార్ట్ అయితే.. రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ గత సోమవారమే మొదలయ్యింది. ఇక చిరు ఆచార్య షూటింగ్ నేడు హైదరాబాద్ లో మొదలైంది. వరుణ్ తేజ్ గని, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లు వాళ్ళ వాళ్ళ సినిమా సెట్స్ మీదకి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ నేడు రాజకీయాలంటూ విజయవాడకి చేరుకున్నారు.
ఇక రామ్ చరణ్ ఈ రోజు నుండి ఆచార్య అటు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. లాక్ డౌన్ లో ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడినా.. చాలావరకు ఫ్యామిలీస్ తోనే గడిపారు హీరోలు. అయితే నేడు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనతో లంచ్ డేట్ కి వెళ్లిన ఫోటో ని షేర్ చేస్తూ.. మిడ్ వీక్, లంచ్ బ్రేక్, లంచ్ డేట్ అంటూ రామ్ చరణ్ తో లంచ్ చెయ్యబోయే పిక్ ని షేర్ చేసింది మెగా కోడలు ఉపాసన. రామ్ చరణ్ తో ఉపాసన లంచ్ డేట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.