టిపిసిసి చీఫ్ గా డైనమిక్ పొలిటిషన్ రేవంత్ రెడ్డిని నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతకుముందే రేవంత్ రెడ్డి పేరు అధిష్టానం బలంగా తీసుకుంది. టిడిపి నుండి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి టీఆరెస్ ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కి పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పగల దమ్మున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ సీనియర్ నేతలకు నచ్చడం లేదు. ఆయనకి టిపిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఒప్పుకోమంటూ కాంగ్రెస్ నేతలు చాలామంది బాహాటంగానే రోడ్డెక్కారు.
అయితే తాజాగా రేవంత్ రెడ్డికి టీపిసిసి పీఠం దక్కింది. దానితో మొదటి రెండు రోజులు టీపిసిసి పీఠం రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై కోమటిరెడ్డి ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులు చిందులు తొక్కారు. తర్వాత రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్ తో సీనియర్ నేతలను కలుస్తూ.. మీడియా ప్రతినిధులకు దగ్గరవుతూ ఆయన ముందడుగు వేశారు. సీనియర్ నేతలైన హనమంతురావు ని హాస్పిటల్ లో పలకరించిన రేవంత్ రెడ్డి.. తర్వాత మిగతా కాంగ్రెస్ నాయకుల దగ్గరకి వెళ్లి అందరిని కలుపుకుపోతూ.. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తో పాటుగా ఈనాడు ఎండి రామోజీరావు గారిని కలవడం, కాంగ్రెస్ పార్టీ సీతక్కని సొంత అక్కలాగా వెనకేసుకురావడం, ఇలా కాంగ్రెస్ నేతలను, మీడియా ప్రతినిధుల నుండి తన పదవికి అందరూ సపోర్ట్ చేసేలా మార్చేసారు.
శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క లతో పాటు రేవంత్‌ను గట్టిగా వ్యతిరేకించిన వీహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఇప్పుడు.. రేవంత్ నాయకత్వంలో పోరాటం చేస్తామని ప్రకటించడంతో రేవంత్ రెడ్డి వ్యూహం సగం ఫలించింది. దానితో నేడు రేవంత్ రెడ్డి అన్ని అడ్డంకులు దాటుకుని టిపిసిసి పదవిని అలకరించబోతున్నారు. మరి భవిష్యత్తులో కేసీఆర్ ని ఎదుర్కునే శక్తిగా మారి ఆయనకి ధీటుగా ప్రజలోకి వెళ్లి కాంగ్రెస్ కి అధికారం కట్టబెడతారని ఆశిస్తూ.. రేవంత్ రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.