కరోనా ఫస్ట్ వేవ్ తో ఎన్నో నెలలు నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ.. ఇప్పుడు సెకండ్ వేవ్ కారణముగా జనవరిలో ఓపెన్ అయిన థియేటర్స్ ఏప్రిల్ లో మూతబడ్డాయి. ఎప్పుడు తెరచుకుంటాయో చెప్పెట్లుగా లేదు వ్యవహారం. అయితే ఏప్రిల్ నుండి పోస్ట్ పోన్ అయిన సినిమాలు చాలా వరకు దసరా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎలాగూ ఆర్.ఆర్.ఆర్ ని అక్టోబర్ 13 అని ఫిక్స్ అయ్యారు. ఇక ఆచార్య, అఖండ, రవితేజ ఖిలాడీ, లైగర్ లాంటి బడా చిత్రాలు దసరాకి కొట్టుకోవడం ఖాయంగా ఉంది.
అయితే ఇప్పుడు దసరా కన్నా ఎక్కువ క్రిస్మస్ బరి మంచి రంజుగా ఉండబోతుంది అని అంటున్నారు. ఎందుకంటే దసరా తర్వాత మళ్ళీ సినిమాలకు పెద్ద పండగలాంటిది క్రిస్మస్, అప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఒకప్పుడు చిన్న, మీడియం సినిమాల హడావిడి క్రిస్మస్ బరిలో కనిపించేవి. కానీ ఇప్పుడు జులై, ఆగష్టు లో విడుదల కావల్సిన సినిమాలను క్రిస్మస్ కి షిఫ్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అందులో పాన్ ఇండియా మూవీస్ కెజిఎఫ్ 2, పుష్ప లు ఉండబోతున్నాయట. కెజిఎఫ్ భారీ అప్ డేట్ అంటూ మేకర్స్ ప్రకటించారు. అంటే క్రిస్మస్ కి కెజిఎఫ్ 2 రిలీజ్ ఖాయం చేస్తారేమో అంటున్నారు.
డిసెంబర్ 21 న కెజిఎఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరో పక్క అల్లు అర్జున్ పుష్ప టీం కూడా క్రిస్మస్ నే ఖాయం చేసేలా ఉందట. ఆగష్టు లో రిలీజ్ కావల్సిన పుష్ప ని క్రిస్మస్ కె రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. మరి కెజిఎఫ్ - పుష్ప వార్ తో క్రిస్మస్ దద్దరిల్లిపోవడం ఖాయమే. ఎందుకంటే పుష్ప లో అల్లు అర్జున్ మాస్ లుక్, కెజిఎఫ్ లో యాష్ మాస్ లోక్ అన్ని కలిపి రెండు సినిమాలపై పాన్ ఇండియాలో భీబత్సమైన క్రేజ్ ఉంది. అది మేటర్.