Advertisementt

ముంబై కి షిఫ్ట్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరో

Tue 06th Jul 2021 06:27 PM
ram charan,mega hero,star hero charan,rrr hero,acharya hero charan,charan to shift to mumbai,sea-facing bungalow,mumbai  ముంబై కి షిఫ్ట్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరో
Ram Charan buys a bungalow in Mumbai ముంబై కి షిఫ్ట్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరో
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా బాట పడుతున్నారు. విజయ్ దేవరకొండ, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రీసెంట్ గా కళ్యాణ్ రామ్.. టాలీవుడ్ హీరోలంతా ఒకళ్ళ తర్వాత ఒకరు పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్ళబోతున్నారు. అందులో ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసాడు. ఇక విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కోసం ముంబైలోనే ఉంటున్నాడు. తర్వాత తారక్, రామ్ చరణ్ లు వరసగా పాన్ ఇండియా మూవీస్ కి సైన్ చేసారు. అయితే ప్రభాస్ కానీ, విజయ్ కానీ ఎవరూ ముంబైకి షిఫ్ట్ అయ్యే ఉద్దేశ్యాలు కనిపించడం లేదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నాడట. 

అక్కడ ముంబైలో ఓ పోష్ ఏరియా లో రామ్ చరణ్ ఓ బంగ్లాని కొనేసాడట. ప్రస్తుతం రామ్ చరణ్ చూపంతా ముంబై మీదే ఉందట. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య ఫినిష్ అవ్వగానే శంకర్ తో పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు రామ్ చరణ్. ఈలోపు ముంబై లో ఓ ఇల్లు కొనేస్తే.. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండొచ్చు అనేది చరణ్ ప్లాన్ అట. శంకర్ సినిమా కోసం తరచు ముంబైకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టే చరణ్ ఇలా.. బీచ్ ఫేసింగ్‌తో ఎంతో విలాసవంతంగా ఓ భవనం కొనేసాడని తెలుస్తోంది. 

ఫ్యామిలీతో సహా వెళ్లి ముంబైలో ఎన్ని రోజులైనా ఉండడానికి వీలుగా సకల సౌకర్యాలు ఈ భవనంలో ఉన్నాయట. ఇక హైదరాబాద్ టు ముంబై వెళ్ళినప్పుడల్లా చరణ్ అక్కడే ఆ ఇంట్లోనే స్టే చేసేలా అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టేసాడట. శంకర్ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్స్ తో మూవీస్ తీసినా.. ముంబై లో ఉండేలా రామ్ చరణ్ పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడని, అక్కడ ముంబై లో కొన్న ఇంట్లో రామ్ చరణ్ త్వరలోనే ఉపాసనతో కలిసి గృహ ప్రవేశం చెయ్యబోతున్నట్టుగా మీడియా కోడై కూస్తుంది. 

Ram Charan buys a bungalow in Mumbai:

Ram Charan Buys a Sea-facing Bungalow in Mumbai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ