అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ గా నటించబోతున్నాడు. ఏజెంట్ గా అఖిల్ స్పై కేరెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఏజెంట్ లుక్ లో అఖిల్ మాస్ గా అదరగొట్టేసిన విషయం ఫస్ట్ లుక్ లోనే తేలిపోయింది. అక్కినేని కుర్ర హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లవ్ స్టోరీ సంగతి ఎలా ఉన్నా.. ఏజెంట్ పై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే ఈ సినిమాలో మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. అఖిల్ - మమ్ముట్టి హీరో - విలన్ గానో, లేదంటే తండ్రి - కొడుకులుగానో కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా అఖిల్ - మమ్ముట్టి ఏజెంట్ లో గురు శిష్యులుగా కనిపిస్తారట. విలన్ గా కాకుండా పాజిటివ్ పాత్రలోనే మమ్ముట్టి కనిపిస్తాడని, అందులోనే అఖిల్ - మమ్ముట్టి లు మధ్యన నువ్వా - నేనా అన్నట్టుగా వారి కేరెక్టర్స్ ని సురేందర్ రెడ్డి డిజైన్ చేసాడట. అన్నట్టు ఏజెంట్ లో మమ్ముట్టి నటిస్తున్నందుకు గాను 3 కోట్లు సమర్పిస్తున్నారు మేకర్స్.