అడివి శేష్ క్షణం సినిమా తో హీరో గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత గూఢచారి, ఎవరు, తాజాగా మేజర్ సినిమాలతో దున్నేస్తున్నాడు. క్షణం సినిమాలో తనకు పుట్టిన పాప కోసం, తన గర్ల్ ఫ్రెండ్ ఆదా శర్మ కి తనకి పుట్టిన పాప అని తెలియని సమయంలోనే పాపని సేవ్ చేసే బాధ్యతని తీసుకుని.. విలన్ అనసూయ నుండి పాపని రక్షించుకునే కేరెక్టర్ లో అడివి శేష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే క్షణం కథ అడివి శేష్ దే. ఆ సినిమాని పివిపి సంస్థ లో బడ్జెట్ లో నిర్మించింది. అయితే అప్పట్లో అంటే క్షణం సినిమా కథ చెప్పడానికి క్షణం నిర్మాణ సంస్థ పివిపి ఆఫీస్ కి వెళితే.. అక్కడ పని చేసే వాళ్ళు.. పివిపి బ్యానర్ లో బ్రహ్మోత్సవం, ఊపిరి లాంటి పెద్ద సినిమాలు తెరకెక్కుతున్నాయి.
మధ్యలో ఈ చిన్న సినిమా క్షణం ఏమిట్రా బాబు అనుకుని.. వీడికి కూడా టీలు అందింఛాలా అన్నట్లుగా ఆఫీస్ బాయ్స్ చూసేవారంటూ తనకి పివిపి ఆఫీస్ లో అవమానంగా అనిపించిన ఓ విషయాన్నీ తరుణ్ భాస్కర్ షో లో బయట పెట్టాడు. దర్శకుడు సుజిత్ - అడివి శేష్ పాల్గొన్న ఈషోలో చాలా విషయాలను పంచుకున్నారు.