తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుండి పార్క్ లు, హోటల్స్, థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. థియేటర్స్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఓపెన్ చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇక తెలంగాణాలో థియేటర్స్ ఓపెన్ అయినా.. ఏపీలో కర్ఫ్యూ నడుస్తుండడంతో సినిమా రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి నిర్మాతలు జంకారు. ఇప్పుడు ఏపీ కూడా థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చంటూ గుడ్ న్యూస్ చెప్పింది.
అయితే 50 శాతం సామర్ధ్యంతోనే థియేటర్స్ ఓపెన్ చేసుకోమని చెప్పింది. మరి 50 పర్సెంట్ అక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు ముందుకి రావాలి. కాదు 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చేవరకు వెయిట్ చేస్తామంటే.. మరికొన్ని రోజులు ఆగాలి. ఇక 50 పర్సెంట్ అయినా, 100 పర్సెంట్ అయినా థియేటర్స్ ఓపెన్ చేస్తే ప్రేక్షకులు వస్తారా? ఇప్పుడు ఇదే దర్శకనిర్మాతల మెదడులో మెదులుతున్న ప్రశ్న.
అందుకే ఈ నెలా పూర్తి అయేవరకు ఆగి అప్పుడు సినిమాల రిలీజ్ డేట్స్ సంగతి చూద్దామనుకుంటున్నారు. అందులోను చాలామంది ఓటిటికి జై కొట్టబోతుంటే.. తెలంగాణ నిర్మాతల మండలి ఆగండాగండి అని అడ్డుపడుతుంది. మరి ఏపీ, తెలంగాణానే కాదు.. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయినా.. సినిమాల సందడే కనిపించడం లేదు.