ఆర్.ఆర్.ఆర్ లో సీత కేరెక్టర్ లో నటిస్తున్న బాలీవుడ్ గ్లామర్ గర్ల్ అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ లో బడా ప్రాజెక్ట్స్ తో బాగా బిజీ. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం అలియా ని సంప్రదించగానే.. ఆమె ఏం ఆలోచించకుండా ఓకె చెప్పేసింది. ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ పాత్ర చాలా చిన్నదట. అయినా అలియా రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కలను సాకారం చేసుకుంది. సీత గా అలియా లుక్స్ అదిరిపోయాయి. ఇక బాలీవుడ్ లో గంగూభాయ్ కతీయవాది సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి డబ్బింగ్ కి వెళ్ళిపోయిన అలియా భట్ నటించిన మరో భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది.
ఇక బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో త్వరలోనే పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉంది. అయితే తాజాగా అలియా భట్ బాలీవుడ్ ఎనేర్జిటిక్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి ఓ లవ్ స్టోరీ చేయబోతుంది. అది కూడా కరణ్ జోహార్ డైరెక్షన్ లో. ఐదేళ్ల తర్వాత దర్శకత్వం చెయ్యబోతున్న కరణ్ జోహార్ ఓ లవ్ స్టోరీకి శ్రీకారం చుట్టినట్లుగా.. ఆ సినిమా టైటిల్ ప్రేమ్ కహాని అని కూడా పెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇక గతంలోనూ గల్లీ బాయ్ సినిమాలో రణ్వీర్ - అలియా కలిసి నటించారు.
ఇక కరణ్ జోహార్ సినిమాలో ఇప్పుడు అలియా భట్, రణ్వీర్ సింగ్ హీరో - హీరోయిన్స్ గా మరోసారి కలిసి నటించబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. ఇంకా ఈ సినిమాలో అమితాబ్ వైఫ్, ప్రముఖ నటి జయ బచ్చన్ కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎనర్జీకి మారు పేరు రణవీర్ తో క్యూట్ అండ్ స్వీట్ గర్ల్ అలియా భట్ జోడి కడితే.. ఆ క్రేజ్ ఆ సినిమా రేంజే వేరు అంటున్నారు బాలీవుడ్ జనాలు.