Advertisementt

ముందు వనితని అడగండి: రమ్యకృష్ణ

Mon 05th Jul 2021 04:23 PM
ramya krishna,reaction,vanitha vijay kumar,sensational comments,ramya krishna special dance show,vanitha vijay kumar comments on ramyakrishna  ముందు వనితని అడగండి: రమ్యకృష్ణ
Ramyakrishna reacts on Vanitha vijay kumar ముందు వనితని అడగండి: రమ్యకృష్ణ
Advertisement
Ads by CJ

కోలీవుడ్ నటి వనిత విజయ్ కుమార్ ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. పర్సనల్ లైఫ్ లో కానివ్వండి.. లేదంటే ప్రొఫెషనల్ గా కానివ్వండి.. తరుచు కాంట్రవర్సీలతో కాపురం చేస్తుంది. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు నాలుగో పెళ్ళికి రెడీ అవుతున్న వనితని ఎవరన్నా ఎమన్నా అంటే వాళ్ళకి సోషల్ మీడియాలో వనిత చేతిలో మూడినట్లే. తాజాగా వనిత విజయకుమార్ ఓ డాన్స్ షో నుండి బయటికి రావడమే కాంట్రవర్సీకి తెర లేపింది. ఆ షో లో జేడ్జ్ గా ఉన్న రమ్యకృష్ణ తనని కించపరిచేలా మాట్లాడింది అని.. స్టేట్మెంట్ ఇచ్చింది. ఓ డాన్స్ షో లో వనిత డాన్స్ చెయ్యలేదని ఆమెకి తక్కువ మార్కులు ఇచ్చిన కారణంగా.. వనిత రమ్యకృష్ణపై విరుచుకుపడింది. 

 ఓ సీనియర్ నటి తనని డాన్స్ బాగా చెయ్యలేదని చులకనగా మాట్లాడితే తట్టుకోవడం కష్టమని, లైఫ్ లో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయిలో ఉన్నాను అని, ముగ్గురు పిలల్ల బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నా గురించి ఆలా మాట్లాడితే భరించడం కష్టం అంటూ ఆ షో నుండి ఆమె అర్ధాంతరంగా తప్పుకుంది. కేవలం రమ్యకృష్ణ కారణంగానే తాను ఈ షో నుండి తప్పుకున్నట్లుగా కలరింగ్ ఇచ్చింది వనిత. 

ఈవిషయమై స్పందించిన రమ్యకృష్ణ.. అసలు  డ్యాన్స్ రియాల్టీ షో షూటింగ్‌ సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని ముందు వనితాని అడిగి తెలుసుకోండి. అయినా నాకు తెలిసినంతవరకూ ఇదేం పెద్ద విషయం కాదు. ఇప్పటికీ మీరు ఈ విషయంపై స్పందించమని కోరితే.. నేను జస్ట్ నో కామెంట్‌ అనే చెబుతాను అంటూ తన స్పందన తెలియజేసింది రమ్యకృష్ణ. 

Ramyakrishna reacts on Vanitha vijay kumar:

Ramya Krishna Reaction About Vanitha Vijay Kumar Sensational Comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ