Advertisementt

మెహ్రీన్ తో అందుకే విడిపోయాను

Mon 05th Jul 2021 12:43 PM
mehreen pirzada,breaks off engagement,bhavya bishnoi,bhavya bishnoi responds,engagement breakup  మెహ్రీన్ తో అందుకే విడిపోయాను
Bhavya Bishnoi responds on engagement breakup మెహ్రీన్ తో అందుకే విడిపోయాను
Advertisement
Ads by CJ

హీరోయిన్ మెహ్రీన్ కౌర్ భవ్య బిష్ణోయ్‌ తో నిశ్చితార్ధం రద్దు చేసుకుంటున్నాను అని ప్రకటించి అందరికి పెద్ద షాకిచ్చింది. మార్చ్ లో ఎంగేజ్మెంట్ చేసుకుని.. త్వలోనే పెళ్లి అనుకుంటున్న టైం లో మెహ్రీన్ ఇలా ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడం, అలాగే భవ్య బిష్ణోయ్‌ ఫ్యామిలీతో తన ఫ్యామిలీకి ఎలాంటి సంబంధాలు ఉండవని ప్రకటించడంతో అందరూ భవ్య బిష్ణోయ్‌ ఫ్యామిలీ వలనే మెహ్రీన్ - భవ్య విడిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

భవ్య ఫ్యామిలీ మెహ్రీన్ కి ఆమె ఫ్యామిలికి సరైన గౌరవం ఇవ్వని కారణంగానే మెహ్రీన్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంది అంటూ పలు కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెహ్రీన్ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్న విషయాన్నీ ప్రకటించినా భవ్య మాత్రం మారుమాట్లాడలేదు. కానీ తాజాగా తాను మెహ్రీన్ కౌర్ ఎందుకు విడిపోయారో చెప్పుకొచ్చాడు. తనకి మెహ్రీన్ కి మధ్యన అభిప్రాయం భేదాలు వచ్చిన కారణంగానే మేము విడిపోయామని, ఈ నిర్ణయం ఇద్దరం కలిసే తీసుకున్నామని, మెహ్రీన్ ని నేను చాలా ప్రేమిస్తాను, అలాగే మా ఫ్యామిలీ మెహ్రీన్ ఫ్యామిలీకి చాలా గౌరవం ఇస్తుంది. మా ఇద్దరిది మంచి పెయిర్ అవుతుంది అనుకున్నాను కానీ అలా జరగలేదు. 

అసలు మెహ్రీన్ నుండి విడిపోయినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. ఇక నిశ్చితార్ధం రద్దు విషయంలో నన్ను, నా ఫ్యామిలీని ఎవరైన నిందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. మా ఫ్యామిలీకి సమాజంలో ఒక గౌరవం ఉంది. మెహ్రీన్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆమె ఫ్యామిలీ బావుండాలి.. తనతో నా జ్ఞాపకాలను ఎప్పటికి గుర్తుంచుకుంటాను అంటూ భవ్య బిష్ణోయ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

Bhavya Bishnoi responds on engagement breakup:

Mehreen Pirzada breaks off engagement with Bhavya Bishnoi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ