రామ్ చరణ్ - కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో RC15 పాన్ ఇండియా మూవీ కోసం అన్ని ఏర్పాట్లు మొదలైపోయాయి. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు చెన్నై కి వెళ్లి మరీ శంకర్ - రామ్ చరణ్ కాంబో RC15 ప్రాజెక్ట్ సెట్ చేసాడు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ - రామ్ చరణ్ కాంబో మూవీ మొదలు కాబోతుంది. అయితే ఇంతవరకు రామ్ చరణ్ దర్శకుడు శంకర్ ని కలిసిన సందర్భం లేదు. RC15 ఫైనల్ చేసినప్పుడు కూడా చరణ్ శంకర్ ని కలవలేదు. దిల్ రాజే అన్ని ముందుండి చూసుకున్నాడు. అయితే ఇప్పుడు శంకర్ - రామ్ చరణ్ కాంబో సెప్టెంబర్ లో మొదలు కాబోతుంది అనే న్యూస్ నడుస్తున్న టైం లో చరణ్ - శంకర్ - దిల్ రాజు మీటింగ్ ప్రధాన్యతను సంతరించుకుంది.
రామ్ చరణ్ అండ్ దిల్ రాజు చెన్నై వెళ్లి స్పెషల్ గా దర్శకుడు శంకర్ ని కలిసి తమ సినిమాపై చర్చలు జరిపిన విషయాన్నీ రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. చరణ్ - శంకర్ - దిల్ రాజు కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ రామ్ చరణ్ నిన్న చెన్నై లో శంకర్ గారిని మీట్ అవడం జరిగింది. థాంక్యూ శంకర్ సర్ Had a fabulous day in Chennai yesterday ! Thank you @shankarshanmugh Sir and family for being such great hosts. Looking forward to #RC15. Updates coming very soon! @SVC_official #SVC50 అంటూ ట్వీట్ చెయ్యడం ఇప్పుడు హైలెట్ అయ్యింది.
తమ కాంబో మూవీ స్పెషల్ అప్ డేట్ త్వరలోనే కాదు.. అతిత్వరలోనే అంటూ చరణ్ చెప్పడంతో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చరణ్ అండ్ శంకర్ మీటింగ్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.