కరోనా సెకండ్ వేవ్ కి ముందే పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కొన్నాళ్ళు ఇంటికి పరిమితమయ్యారు. కరోనా వలన పవన్ చాలా సిక్ అయ్యారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. దానితో అటు రాజకీయాలు, ఇటు పక్కనబెట్టేసి.. ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. తర్వాత లాక్ డౌన్ రావడం షూటింగ్స్ వాయిదా పడడం జరిగింది. తాజాగా పవన్ సినిమా షూటింగ్స్ కి రెడీ అవుతున్నారు. దానితో పాటుగానే పవన్ పొలిటికల్ గాను బిజీ కాబోతున్నారు.
ఈ నెల 6న విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు.
7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు పవన్ కళ్యాణ్.