Advertisementt

సత్య దేవ్ బర్త్ డే స్పెషల్

Sun 04th Jul 2021 12:44 PM
hero satyadev,sathya dev birthday special,satyadev birthday,gurthunda seetakjalam movie,god se,timmarusu  సత్య దేవ్ బర్త్ డే స్పెషల్
Satyadev Birthday Special సత్య దేవ్ బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

వెండితెర మీదకి పెద్ద స్టార్స్ సినిమాల్లో చిన్న చిన్న కేరెక్టర్స్ తో అడుగుపెట్టి.. నటుడిగా టాలెంట్ ప్రూవ్ చేసుకుని.. ఈరోజు హీరోగా ఎదిగిన వాళ్లలో సత్య దేవ్ ముందు వరసలో ఉంటాడు. అత్తారింటికి దారేది, ఇంకా చాలా సినిమాల్లో చాలా చిన్న కేరెక్టర్స్ చేసిన సత్యదేవ్.. ఆ తర్వాత యంగ్ హీరోస్ మూవీస్ లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో తో సమానమైన పాత్రలతో మెప్పించాడు. అందులో అంతరిక్షం, ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవారెవరురా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో సత్యదేవ్ పెరఫామెన్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అప్పుడు అలా కెరీర్ ని మొదలు పెట్టిన సత్యదేవ్ ఇప్పుడు హీరోగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. 

ప్రస్తుతం యంగ్ హీరోల సరసన చేరిన సత్య దేవ్ హీరోగా నటించిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, రాగల 24 గంటలు సినిమాలు హిట్ అవడంతో సత్యదేవ్ కెరీర్ వెనుదిరిగి చూసుకోవక్కర్లేకుండా పోయింది. ప్రెజెంట్ తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్న సత్య దేవ్ చేతిలో తిమ్మరుసు, గాడ్సే సినిమాలు ఉన్నాయి. తాజాగా సత్యదేవ్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తన 25వ చిత్రం చెయ్యబోతున్నాడు. 

స‌త్య‌దేవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. న‌లుగురు వ్య‌క్తులు ఓ వ్య‌క్తిని కాల్చ‌డానికి సిద్ధంగా ఉండ‌టం, ఓ వైపు జీపు ఆగి ఉండ‌టం అనే విష‌యాల‌ను పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే స‌త్య‌దేవ్ లుక్ సరికొత్త‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తొలిసారి ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఆయన బర్త్ డే స్పెషల్ గా.. స్పెషల్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

ఇక కెరీర్ లో ఫుల్ స్వింగ్ తో ఇలానే దూసుకుపోవాలని కోరుకుంటూ..  ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సత్యదేవ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. 

Satyadev Birthday Special:

Star director Koratala Siva to present versatile actor Satyadev 25th film under Arunachala Creations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ