విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. విజయ్ - పూరి కాంబో లైగర్ మూవీపై బాలీవుడ్ లోను, ఇతర భాషల్లోనూ మంచి అంచనాలున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవడం, హీరోయిన్ అనన్య పాండే, విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్రేజ్ అన్ని ఈ సినిమాకి కలిసిరాబోతున్నాయి. ఇక లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ సినిమా చెయ్యాలి కానీ, అది పక్కనబెట్టి సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు. ఆ మధ్యన సుక్కు - విజయ్ మూవీ ఆగిపోయింది అని అన్నారు. కానీ మధ్యలో నిర్మాతలు అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ సుకుమార్ మూవీ తర్వాత డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - యాక్షన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి ఓ మూవీ ప్లాన్ చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. పవన్ తో మూవీ ఫినిష్ అవ్వగానే హరీష్ విజయ్ దేవరకొండ తో దిల్ రాజు నిర్మాణంలో చేసే ఛాన్స్ ఉంది అని, త్వరలోనే ఆ సినిమాపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లుగా తెలుస్తుంది.