Advertisementt

రామ్ చరణ్ కి లైన్ క్లియర్

Sat 03rd Jul 2021 08:39 PM
ram charan,shankar,rc 15,charan - shanakr combo,dil raju - charan combo,shankar - dil raju combo,india 2 matter,lyca productions,madras high court  రామ్ చరణ్ కి లైన్ క్లియర్
HC gives huge relief for Shankar రామ్ చరణ్ కి లైన్ క్లియర్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య మూవీస్ ఫినిష్ కాగానే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శంకర్ కూడా ఉత్సాహంతో రామ్ చరణ్ తో మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టేసారు. ఇంతలోపులో ఇండియన్ 2 నిర్మాతలు శంకర్ పై కోర్టుకెక్కారు. ఇండియన్ 2 పూర్తి చేసి ఇతర ప్రాజెక్ట్స్ చేసుకోమని శంకర్ కి చెప్పమని కోర్టుని కోరారు లైకా వారు. అయితే ఆ కేసు ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలకు శంకర్ కి చెప్పింది కోర్టు. 

తాజాగా మరోసారి చర్చకు వచ్చిన ఈ వివాదం విషయంలో కోర్టు శంకర్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2019 లో లైకా వారు చేసిన ఒప్పందం ప్రకారం షరతులు పాటించలేదని, అలాంటప్పుడు దర్శకుడు అనుకున్న సమయానికి సినిమా ఎలా పూర్తి చేస్తాడని, అంతేకాకుండా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్మాణ సంస్థ ఒక్కసారి కూడా ముందుకు రాలేదని, అసలు దర్శకుడితో మాట్లాడకుండా నేరుగా కోర్టుకు రావడం కుదరదని చెప్పడంతో.. ఇప్పుడు శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో లైన్ క్లియర్ అయ్యింది. 

అంటే రామ్ చరణ్ - శంకర్ - దిల్ రాజు మూవీ సెప్టెంబర్ రెండో వారంలో పూజ కార్యక్రమాలతో మొదలవుతుంది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లొచ్చనే న్యూస్ నిజమైనట్టే కనిపిస్తుంది. 

HC gives huge relief for Shankar:

Shankar can breathe easy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ