Advertisementt

మొన్న పోస్ట్ పోన్.. ఇప్పుడు బ్రేకప్

Sat 03rd Jul 2021 07:14 PM
mehreen makes,shocking announcement,mehreen shocking announcement,young politician bhavya bishnoi,social media,bhavya bishnoi and i have decided to break off our engagement  మొన్న పోస్ట్ పోన్.. ఇప్పుడు బ్రేకప్
Mehreen makes a shocking announcement మొన్న పోస్ట్ పోన్.. ఇప్పుడు బ్రేకప్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది మార్చ్ లో జైపూర్ లో పొలిటిషన్ భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్ధం చేసుకుని షాకిచ్చిన మెహ్రీన్ కౌర్.. ఈపాటికి పెళ్లి పీటలెక్కాల్సి ఉంది. ఎంతో ప్రేమించి భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్ధం చేసుకున్న మెహ్రీన్ ఆ నిశ్చితార్ధం అవ్వగానే.. మెహ్రీన్ అలాగే భవ్య ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు. దానితో మెహ్రీన్ పెళ్లిని వాయిదా వేస్తున్నట్లుగా చెప్పింది. కరోనా లాక్ డౌన్ ముగిసాక భవ్య తో తన పెళ్లి జరుగుతుంది అని.. ఈ పెళ్లి పనులని తాము ఇద్దరం దగ్గరుండి చూసుకుంటామని, అదే తమకి తృప్తి అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన మెహ్రీన్ .. ఇప్పడు నిశ్చితర్ధాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్లుగా చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. 

తాము ఇద్దరం బాగా ఆలోచించే తమ నిశ్సితార్ధాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఉదయం ఎఫ్ 3 షూటింగ్ స్పాట్ లో నవ్వుతూ వరుణ్ తేజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడితో కనిపించిన మెహ్రీన్ ఇప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నట్లుగా ప్రకటించడం ఆమె అభిమానులకు కష్టంగా ఉంది. అయితే భవ్య.. తాను ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయానికి వచ్చామని, అలాగే ఇక మీదట భవ్య కుటుంబంతో తనకి తన ఫ్యామిలీకి కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేసింది. 

అయితే మెహ్రీన్ అలా పెళ్లిని రద్దు చేసుకోవడం వెనుక ఎలాంటి కారణాలున్నా.. ప్రస్తుతం తాను ఫాన్స్ కోసం సినిమాల్తో బిజీ కావాలనుకుంటున్నట్టుగా కూల్ గా చెప్పుకొచ్చింది.  

Mehreen makes a shocking announcement:

Mehreen Kaur breaks off her engagement with Bhavya Bishnoi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ