Advertisementt

బాలీవుడ్ చిన్నది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తో

Sat 03rd Jul 2021 06:38 PM
bollywood actress,sara ali khan,dating,kedarnath assistant director,jehan handa - sara ali khan  బాలీవుడ్ చిన్నది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తో
Sara Ali Khan dating Kedarnath Assistant Director బాలీవుడ్ చిన్నది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తో
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో అలా సినిమాలోకి అడుగుపెట్టగానే ఇలా బాయ్ ఫ్రెండ్ ని వెతికేసుకుంటున్నారు ఈ తరం హీరోయిన్స్. ఒకటి రెండు సినిమాలకే హీరోలతో డేటింగ్స్, లేదంటే ఇతర బాయ్ ఫ్రెండ్స్ తో బిజీగా వెకేషన్స్ కి చెక్కేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరూ ప్రస్తుతం ఖాళీగా లేరు. ఎవరో ఒక లవర్ తోనో, బాయ్ ఫ్రెండ్స్ తోనో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. నిన్నగాక మొన్న బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ ఆ మధ్యన హీరో కార్తీక్ ఆర్యన్ తో లవ్ ఉంది అనే టాక్ నడిచింది. కానీ అది నిజం కాదట.

ఇప్పుడు సారా అలీ ఖాన్ మరొకరితో డేటింగ్ లో ఉందట. కార్తీక్ తో కలిసి హోటల్స్ కి, అక్కడా ఇక్కడ తిరిగిన సారా అలీఖాన్ కార్తీక్ కాకుండా మరొకరితో లవ్ లో ఉండనే విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. అయితే మొన్నామధ్యన సారా లవ్ గురించి, ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి ఇంగ్లీష్ డైలీ లో ఓ కథనం ప్రసారం అయ్యింది. అది సారా అలీ ఖాన్ తన ఫస్ట్ మూవీ కేదారనాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ జహన్‌ హండాతో డేటింగ్‌లో ఉందని. 

తాజాగా ఓ హాలిడే స్పాట్ లో తామిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ ని జహన్‌ హండా తన సోషల్ మీడియా పేజీ లో షేర్ చెయ్యగా.. వాటిని సారా అలీ ఖాన్ లైక్ కొడుతూ.. ఐ లవ్‌ యూ.. మళ్లీ ఆ రోజులకు తీసుకు వెళ్లు అని ట్వీట్ చెయ్యడంతో సారా అలీ ఖాన్ - జహన్‌ డేటింగ్ లో ఉన్నది నిజమే అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. 

Sara Ali Khan dating Kedarnath Assistant Director:

Sara Ali Khan dating Kedarnath Assistant Director Jehan Handa 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ