Advertisementt

ధనుష్ - వెంకీ అట్లూరి కాంబో.. స్టోరీ లీక్

Sat 03rd Jul 2021 05:35 PM
dhanush,second telugu film,venky atluri,director sekhar kammula,dhanush - venky atluri  ధనుష్ - వెంకీ అట్లూరి కాంబో.. స్టోరీ లీక్
Dhanush - Venky Atluri story revealed ధనుష్ - వెంకీ అట్లూరి కాంబో.. స్టోరీ లీక్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లవ్లీ డైరెక్టర్స్ తో కోలీవుడ్ హీరో ధనుష్ లైనప్ మాములుగా లేదు. ఇప్పటికే ధనుష్ టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూడు భాషల్లో మూవీ కమిట్ అయ్యి అధికారికంగా ప్రకటించాడు. తాజాగా ధనుష్ తన D43 మూవీ షూటింగ్ కోసం హైదెరాబాద్ కి వచ్చాడు. హైదెరాబాద్ లోనే స్టే చేసిన ధనుష్ శేఖర్ కమ్ముల - నిర్మాతలతో మీట్ అయ్యాడు. ఇక ధనుష్ మరో టాలీవుడ్ డైరెక్టర్ సినిమా ఓకె చేసాడనే టాక్ నడుస్తుంది. అది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ధనుష్ కి ఓ లైన్ చెప్పి మెప్పించాడని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ధనుష్ - వెంకీ అట్లూరి మూవీ ఉండబోతుందట. 

ఇప్పటివరకు ప్రేమ కథలతో మెప్పించిన వెంకీ అట్లూరి ఈసారి ధనుష్ తో ఓ మాస్ మూవీ ప్లాన్ చేసాడట. ఈమధ్యనే వెంకీ అట్లూరి, ధనుష్ ని కలిసి కథని వివరించి సినిమా ఓకె చేయించుకున్నాడట. అయితే వీళ్ళ కాంబోలో తెరకెక్కబోయే సినిమా విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో తెరకెక్కబోతుందట. ప్రస్తుతం విద్యాసంస్థల పేరిట దోపిడీ లు జరగడమే కాదు.. అందులోని లోపాలను ఎత్తి చూపించే యువకుడిగా ధనుష్ ఈ సినిమాలో కనిపిస్తాడని, అంతేకాకుండా ధ‌నుష్ పాత్ర సీరియ‌స్ ఎమోష‌న్‌తో సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే తెరకెక్కబోతుంది. 

Dhanush - Venky Atluri story revealed:

Dhanush Signs His Second Telugu Film With Venky Atluri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ