మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో ఈ ఏడాది జనవరిలో మొదలైన సర్కారు వారి పాట షూటింగ్ ఈ వీక్ లోనే మళ్ళీ మొదలు కాబోతుంది. మహేష్ అండ్ టీం వాక్సీన్స్ వేయించుకుని మరీ రంగంలోకి దిగబోతున్నారు. కీర్తి సురేష్ కూడా ఎప్పుడెప్పుడు సర్కారు వారి పాట షూట్ లో పాల్గొందామా అని ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమాలో ఇంతవరకు విలన్ ఎవరనేది రివీల్ చెయ్యలేదు. మహేష్ కి పోటీగా సర్కారు వారి పాట విలన్ ప్లేస్ లో రకరకాల బాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపించినా చివరికి కోలీవుడ్ హీరో అర్జున్ పేరు గట్టిగా ప్రచారం లోకి వచ్చింది. దాదాపుగా సర్కారు వారి పాట విలన్ అర్జునే అని చాలామందే ఫిక్స్ అయ్యారు.
ఇక సర్కారు వారి పాట షూట్ రెస్యూమ్స్ తో విలన్ గా అర్జున్ పేరు అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో అర్జున్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అర్జున్ కరెప్టెడ్ పోలీస్ అధికారిగా మహేష్ ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేస్తాడని, మహేష్ ఏం చేసినా అర్జున్ అడ్డం పడిపోతాడంటూ ఆ న్యూస్ సారాంశం. మరి ఈ సినిమాలో అర్జున్ నటిస్తున్నాడు అనేది.. ఎంతవరకు కరెక్ట్. ఆయన పాత్ర ఇదే అనేది ఎంతవరకు కరెక్ట్.. టీం స్పందిస్తేనే కానీ తెలియదు.