ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో స్ట్రయిట్ బాలీవుడ్ ఫిలిం గాను, పాన్ ఇండియా మూవీ గాను ఆదిపురుష్ 30 శాతం షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కి ముందే పూర్తి చేసుకుంది. రెండు షెడ్యూల్స్ లో ఆదిపురుష్ షూటింగ్ ని ఓం రౌత్ చాలా ఫాస్ట్ గా కానిచ్చేశాడు. ప్రభాస్ రాముడిగా, సీత గా కృతి సనాన్ నటిస్తున్న ఆదిపురుష్ లో విలన్ రావణ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ నటిస్తున్నాడు. సెకండ్ వేవ్ కి ముందు ఆదిపురుష్ టీం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మకాం పెట్టాలనుకుంది. కానీ తెలంగాణాలో కూడా లాక్ డౌన్ పెట్టడంతో ఆదిపురుష్ షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది.
లేదంటే రామోజీ ఫిలిం సిటీలో ఆదిపురుష్ సెట్ వేసుకుని మూడు నెలలు ఏకధాటిగా షూట్ చెయ్యాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక తాజాగా మహారాష్ట్ర ముంబై లో లాక్ డౌన్ సడలింపులతో ఆదిపురుష్ టీం షూటింగ్ కోసం రెడీ అయ్యింది. ఈ రోజు నుండే ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో ఆదిపురుష్ సెట్స్ లో మొదలు కాబోతుంది అంటూ ప్రభాస్ ఫాన్స్ కి సర్ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చేసారు. ముంబై లో ఆదిపురుష్ 3rd షెడ్యూల్ మొదలు కాబోతుంది అంటూ అప్ డేట్ ఇచ్చేసారు. ఇక ఈ షెడ్యూల్ లో విలన్ పాత్రదారి సైఫ్ అలీ ఖాన్ మీద కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని, ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆదిపురుష్ సెట్స్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు.