Advertisementt

వివాదాలు విశాల్ కి కొత్తకాదు

Sat 03rd Jul 2021 10:36 AM
vishal,kollywood action hero,assistant director,complains against vishal,vishal lands in trouble  వివాదాలు విశాల్ కి కొత్తకాదు
Assistant director complains against Vishal వివాదాలు విశాల్ కి కొత్తకాదు
Advertisement
Ads by CJ

నడిగర్ సంఘం ఎన్నికల టైం నుండి తరుచు వివాదాల్లో చిక్కుకుంటున్న కోలీవుడ్ యాక్షన్ హీరో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. డిటెక్టీవ్ దర్శకుడు మిస్కిన్ తో అభిప్రాయం భేదాలు రావడంతో మిస్కిన్ విశాల్ మీద చాలాసార్లు ఫైర్ అయ్యాడు. ఆతర్వాత రీసెంట్ గా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేతతో ప్రామిసరీ నోట్స్ విషయంలో మరోసారి వార్తల్లో నిలిచాడు విశాల్. తాజాగా విశాల్ మీద కోలీవుడ్ సహాయ దర్శకుడు కంప్లైంట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. 

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అతను విశాల్ కి కామన్ మ్యాన్ టైటిల్ తో ఓ కథ చెప్పినప్పుడు ఏ మాట్లాడకుండా విన్న విశాల్.. ఇప్పుడు  తన టైటిల్ వాడేసుకుంటున్నాడని.. ఆ విషయంలో ఇబ్బంది రాకుండా దానిని నాట్ ఏ కామన్ మ్యాన్ అంటూ టాగ్ లైన్ పెట్టుకున్నాడు విశాల్ అంటూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపణలు  చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తన వివాదాన్ని తమిళనాడు డీఎంకే యువ ఎమ్యెల్యే ఉదయనిధి స్టాలిన్ వద్దకు తీసుకువచ్చాడు. 

మరి ఉదయనిధి కూడా ఓ హీరోనే. ఎమ్యెల్యేగా ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కి ఉదయానిది ఎలాంటి సహాయం చేస్తాడో తెలియదు  కానీ.. విశాల్ పేరు మాత్రం కోలీవుడ్ లో మార్మోగిపోతుంది. అన్నిటికి నీతులు చెప్పే విశాల్ చేస్తాడా అంటూ ఆయన వ్యతిరేఖులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. 

Assistant director complains against Vishal:

Vishal lands in trouble

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ