అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్ అమెరికన్ సునీతా విలయమ్స్ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన గుంటూరుకి చెందిన శిరీష అరుదైన ఘనత సాధించింది. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా శిరీష.
వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను లోసంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష కూడా చోటు సంపాదించు కోవడం విశేషంగా నిలిచింది. వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలుదేరుతుందని కంపెనీ ప్రకటించింది.
2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరారు శిరీష. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకుంటూ ఎదిగారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేసిన శిరీషా జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు.