ఇండియా మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ లోకి గత నెల 3 వ తేదీన అందుబాటులోకి వచ్చింది. సమంత - మనోజ్ భాజపేయీ కీలక పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో కేవలం హిందీ భాషలో.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి క్రేజ్ తో ఎంతో హైప్ తో రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 అందరి అంచనాలు మించి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సమంత పాత్రపై తమిళుల నుండి వ్యతిరేఖత ఏర్పడినా ఈ సీరీస్ ని ఇండియా వైడ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు.
అయితే గత నెలలో ఈ సీజన్ రిలీజ్ అయిన దగ్గర నుండి తెలుగు ప్రేక్షకులు ఈ సీజన్ తెలుగు వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగు మాత్రమే కాదు.. తమిళ్, మలయాళం వంటి భాషల్లోనూ ఫ్యామిలీ మ్యాన్ డబ్బడ్ వెర్షన్ కోసం ఫాన్స్ వెయిటింగ్. ఇక మిగతా లాంగ్వేజ్ అన్ని అదిగో ఇదిగో అంటూ వార్తలొస్తున్నాయి తప్ప మేకర్స్ ఫ్యామిలీ మ్యాన్ ని ఇతర భాషల్లో డబ్ చేసింది లేదు. చాలామంది ఓ వారంలో ఈ వెబ్ సీరీస్ తెలుగులో వచ్చేస్తుంది.. ఈలోపు హిందీలో చూడడం ఎందుకులే అని ఎదురు చూసారు. కానీ వారం పోయింది, పది రోజులు గడిచాయి. ఇప్పుడు నెల అయ్యింది. అయినా ఇప్పటికి ఫ్యామిలీ మ్యాన్ తెలుగు లో అందుబాటులోకి రాకపోవడం తెలుగు ప్రేక్షకులు డిస్పాయింట్ అయ్యేలా చేసింది.