రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ని ఎట్టి పరిస్తితుల్లో అక్టోబర్ 13 నే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది టీం. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ టీం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టెయ్యబోతుంది. అయితే ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న ఆర్.ఆర్ ఆర్ పై పోటీకి ఆచార్య సిద్దమవుతున్నాడంటున్నారు. చిరు - రామ్ చరణ్ కలయికలో కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ మే లో విడుదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ అడ్డం పడడంతో ఆచార్య ని ఆగష్టు లో రిలీజ్ కి ప్లాన్ చేసున్నారని అన్నారు.
కానీ మరో వారంలో ఆచార్య రెస్యూమ్ షూట్ మొదలు పెట్టగానే ఆచార్య రిలీజ్ డేట్ ఇవ్వాలని చిరు అండ్ టీం భావిస్తోందట. అయితే ఆచార్య సినిమాని అక్టోబర్ 13న అయినా 14న అయినా రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారట. అంటే దసరా బరిలో ఆచార్య ని ఫిక్స్ చెయ్యాలని చూస్తున్నారట. అలా అయితే ఆర్.ఆర్.ఆర్ ని ఢీ కొట్టడానికి ఆచార్య ఆల్మోస్ట్ సిద్దమయినట్లే అంటున్నారు. మరి రామ్ చరణ్ ఒకేసారి రెండు సినిమాల్తో ఫాన్స్ కి ట్రీట్ ఇస్తాడో.. లేదంటే ఆర్.ఆర్.ఆర్ మీదకి మనమెందుకులే అని అలోచించి సెప్టెంబర్ లో అయినా ఆచార్య రిలీజ్ ప్లాన్ చేస్తారో అనుకుంటుంటే..
కాదు అక్టోబర్ లోనే ఆచార్య అంటూ ప్రచారం మొదలైంది. రెస్యూమ్ షూట్ అప్ డేట్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి ప్రకటించబోతుందట ఆచార్య టీం.