Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే అప్ డేట్

Fri 02nd Jul 2021 01:53 PM
young tiger ntr,evaru meelo koteeswarulu show,gemini channel,ntr,tarak,evaru meelo koteeswarulu update  ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే అప్ డేట్
NTR Evaru Meelo Koteeswarudu Show update ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ షూట్ అవ్వగానే డబ్బింగ్ షురూ చెయ్యబోతున్న ఎన్టీఆర్.. తదుపరి చెయ్యబోయే బుల్లితెర గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు షో డేట్ కూడా వచ్చేసింది. బిగ్ బాస్ ఫినిష్ అయ్యాక మళ్ళీ బుల్లితెర మీద ఎన్టీఆర్ హోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నా ఫాన్స్ కి ఈ న్యూస్ నిజంగా గుడ్ న్యూస్. గత రెండు నెలలుగా ఎన్టీఆర్ జెమినీ ఛానల్ లో చెయ్యబోయే ఎవరు మీలో కోటీశ్వరు షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చూస్తున్నారు. 

తాజాగా సెకండ్ వేవ్ కంట్రోల్ అవడంతో షో కి సంబందించిన పనులు షురూ చేశారట. ఇప్పటికే ఈ షో కోసం నిర్వహకులు ఆడిషన్స్ నిర్వహించారని.. ఇక వచ్చే వారం నుంచి షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట. జూన్ 7 న మొదలు కాబోయే షెడ్యూల్ కి యంగ్ టైగర్ కూడా హాజరవ్వనున్నారట. అయితే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో నిర్వహకులకు డేట్స్ కూడా కేటాయించాడని తెలిసింది. వచ్చే వారం నుంచి షో షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ.. ప్రసారం మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. 

ముందుగా ఎన్టీఆర్ పై కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసి వాటిని ఎడిట్ చేసి.. ఆ తరవాత ఆ షో ని జెమినీ ఛానల్ లో ప్రసారం చేస్తారట. మరి ఈ షో వచ్చే ఆగస్టు నుండి మొదలు కావొచ్చని న్యూస్ మాత్రం బాగా వినిపిస్తుండగా.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. 

NTR Evaru Meelo Koteeswarudu Show update:

Young tiger NTR Evaru Meelo Koteeswarulu Show update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ