ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ ఫిలిం గా తెరకెక్కుతున్న సలార్ మూవీ పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. కెజిఎఫ్ తో పాన్ ఇండియా ని కొల్లగొట్టిన ప్రశాంత్ నీల్.. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన ప్రభాస్ కలయికలో వస్తున్న సలార్ మూవీ పై విపరీతమైన క్రేజ్, హైప్ ఉన్నాయి. ఇప్పటికే సలార్ ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియా ని షేక్ చేసింది ఈ జంట. అలాగే సలార్ ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ తో కలిసి నటిస్తున్న శృతి హాసన్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది.
ఇక సలార్ షూట్ స్టార్ట్ అయినప్పుడే స్పాట్ నుండి కొన్ని ఫొటోస్ లీకుల రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా ఇప్పుడు రెస్యూమ్ షూట్ మొదలు కాకముందే మరొకిన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ లో ఉన్న డ్రెస్, బ్యాగ్రౌండ్ తోనే ప్రభాస్ ఓ బైక్ మీద ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరాలవుతున్నాయి. క్రేజీ ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ సలార్ లీకెడ్ పిక్స్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.