గత ఏడాది బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు లేపింది. బాలీవుడ్ లో బడా హీరియిన్స్ సైతం ఎన్ సీబీ విచారణ ఎదుర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ మరణాంతరం బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ చుట్టూ తిరిగింది. ఆ కేసు విషయం తేలలేదు. ఇక గతంలో టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యారు. పూరి, ఛార్మి, రవితేజ, తనీష్, నందు, సుబ్బరాజు, నవదీప్ ఇలా ఓ 12 మంది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు.
అప్పట్లో ఈ డ్రగ్స్ విచారణ టాలీవుడ్ ని కుదిపేసింది. ఆ తరవాత విచారణ అధికారులు స్టార్స్ నుండి బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ కూడా సేకరించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ డ్రగ్స్ కేసుని టీఆరెస్ ప్రభుత్వంపైకి రాకుండా తొక్కేసింది అన్నారు. టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ ఈ కేసుని నీరు కార్చేసి టాలీవుడ్ ని కాపీడేసే ప్రయత్నాలు గట్టిగా చేసారు అని ప్రచారం జరిగినట్టుగానే.. ఈ కేసులో 11 మందికి క్లీన్ చిట్ ఇచ్చేసారు.
మరి నిజంగా విచిత్రం కాకపోతే ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు.. అధికారులు నమోదు చేసిన ఛార్జ్ షీట్స్ ఏమయ్యాయో తెలియదు. ఇంకేమి లేదు.. ఇలా స్టార్స్ ఎవరు డ్రగ్స్ వాడలేదు అని క్లీన్ చిట్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.