అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో బిజీ కాబోతున్నారు. సుకుమార్ అండ్ పుష్ప టీం తో కలిసి గోవాకి చెక్కెయ్యనున్న అల్లు అర్జున్ నెక్స్ట్ పై ఉత్కంఠ వీడడం లేదు. పుష్ప పార్ట్ 1 కి పుష్ప పార్ట్ 2 కి మధ్యన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. గీత ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మాత బన్నీ వాస్ ఐకాన్ ని కన్ఫర్మ్ చేసినా.. అల్లు అర్జున్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ తమిళ నిర్మాత టచ్ లో ఉన్నాడట.
బోయపాటి, ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్ ఇవన్నీ పక్కనబెట్టి తమిళ దర్శకనిర్మాతలతో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నాడని.. ఏ ఆర్ మురగదాస్ కాంబోలో అల్లు అర్జున్ నెక్స్ట్ ఉండబోతుంది అని అంటున్నారు.
తమిళ బడా ప్రొడ్యూసర్ ఎస్.థాను బన్నీ తో చర్చలు జరుపుతున్నట్టుగా రివీల్ చేసారు. తమిళంలో తుపాకి, పోలీసోడు, కబాలి, అసురన్, కర్ణన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన థాను అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ తమిళ దర్శకనిర్మాతలతోనే ఉంటుంది అంటూ అందరూ ఫిక్స్ అవుతున్నా ప్రకటన వచ్చేవరకు దానిపై ఓ క్లారిటీకి రావడం కుదరదేమో.