టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ గ్లామర్ చూపించినా పని జరగక.. బాలీవుడ్ కి బిషానా సర్ధేశి అక్కడ హీరోయిన్స్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది తాప్సి పన్ను. బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్న తాప్సి కి స్టార్ హీరో అవకాశాలు కూడా వస్తున్నాయట. బి టౌన్ స్టార్ హీరో కంగనాతో నువ్వా నేనా అని పోటీ పడే తాప్సి పన్ను రేంజ్ బాలీవుడ్ లో అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు.
బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు మేకర్స్ ఇచ్చిన పారితోషకంతో సర్దుకుపోయిన తాప్సి.. ఈ ఏడాది వరకు కోటి నుండి కోటిన్నరతోనే సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు తాప్సి డిమాండ్ చేస్తుందట. 2 కోట్లు అయితే చేస్తా అని. తాప్సి తాను చెయ్యబోయే సినిమాల బడ్జెట్ ని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఒకవేళ పాత్ర బావుంటే, అప్పుడు పారితోషకం చూసి చూడాట్టుగా పోనిస్తుందట. అయితే తాప్సి ఇటు సినిమాలే కాదు.. అటు కొన్ని కంపెనీ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఏడాది 40 కోట్లు వరకు వెనకేస్తుంది అని బాలీవుడ్ మీడియా టాక్.