కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ రీసెంట్ మూవీ జగమే తంతిరం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. ప్లాప్ టాక్ పడిన ఆ సినిమాలో ధనుష్ నటన తప్ప మరి కొత్తదనమన్నదే లేదు. ఇక ఆ సినిమా తర్వాత ధనుష్ హాలీవుడ్ మూవీ లో నటిస్తున్నాడు. ఈమధ్యనే అమెరికా వెళ్లి ఆ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఇక తాజాగా టాలీవుడ్ లవ్లీ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన ధనుష్ ముందుగా మరో రెండు మూవీస్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
అందులో ముందుగా ధనుష్ - మాళవిక మోహన్ కలయికలో తెరకెక్కుతున్న #D43 రెస్యూమ్ షూట్ ని మొదలు పెట్టాడు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ తో కలిసి చేస్తున్న D43 మూవీ రెస్యూమ్ షూట్ ఈ రోజే మొదలైంది. అది హైదరాబాద్ లో D43 రెస్యూమ్ షూట్ ని మొదలు పెట్టినట్లుగా ప్రకటన చేసారు. గ్లామర్ గర్ల్ మాళవిక మోహన్ - మాస్ హీరో ధనుష్ కలయికలో రాబోతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ మరో మూవీ చేయనున్నాడు. ఆ తర్వాతే శేఖర్ కమ్ముల మూవీని పట్టాలెక్కించబోతున్నాడు ధనుష్.