బాహుబలిలో ప్రభాస్ కటవుట్ కె గుడి కట్టేంతగా ఫాన్స్ హడావిడి చేసారు. అదే ప్రభాస్ సాహో సినిమా విషయానికి వచ్చేసరికి.. లుక్స్ పరంగా ట్రోల్ అయ్యాడు. సాహో లో ప్రభాస్ హెయిర్ స్టయిల్, ఆయన బరువు పెరిగిన బాడీ పై చాలా కామెంట్స్ పడ్డాయి. ఇక తాజాగా రాధేశ్యామ్ లో ప్రభాస్ లుక్స్ పై ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రభాస్ హెయిర్ స్టయిల్ విషయంలో ఈమధ్యన తేలిపోతున్నాడు. అందుకే సలార్ కి ఆ ప్రాబ్లెమ్ లేకుండా ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉన్నాడట.
అందులోను ప్రభాస్ సలార్ లో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని, ఒకపాత్రలో ప్రభాస్ ప్రభాస్ కి తండ్రిగా కనిపిస్తాడట. అయితే తండ్రి కొడుకులుగా ప్రభాస్ లుక్స్ లో భారీ తేడా కోసం మేకర్స్ పర్ఫెక్ట్ గా అన్ని ప్లాన్ చేసుకుంటున్నారట. రెండు పాత్రల కోసం డిఫరెంట్ స్టయిల్స్ ని ఫాలో అవుతున్నారట. ఇక ప్రభాస్ తండ్రి పాత్ర హెయిర్ స్టయిల్ కోసం 4 లక్షలు ఖర్చుపెడుతున్నారట మేకర్స్. అసలు ఇప్పటివరకు ప్రభాస్ కి ఆ రేంజ్ లో హెయిర్ స్టయిల్ కి ఖర్చు చెయ్యాల్సిన అవసరం రాలేదట. కానీ ఇప్పుడు సలార్ కోసం ఆయన హెయిర్ స్టయిల్ విషయంలో ఎక్కడా తగ్గేదెలే అంటున్నారట.