పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియం మూవీ ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. జులై సెకండ్ వీక్ నుండి ఏకే రీమేక్ కోసం వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో రెస్యూమ్ షూట్ మొదలు కాబోతుంది. మలయాళంలో హిట్ అయిన అయ్యప్పన్ కోషియం ని తెలుగులోకి వచ్చేసరికి చాలా మార్పులే చేశారట. దర్శకుడు త్రివిక్రమ్ సాయంతో తెలుగు నేటివిటీకి సరిపోయేలా కథని సిద్ధం చేశారట దర్శకుడు సాగర్.
అయితే అక్కడ మలయాళంలో బిజూ మీనన్ - పృథ్వి రాజ్ ల మధ్యన తలెత్తిన ఈగో కథని మొత్తం నడిపిస్తుంది. బిజూ మీనన్ గా పవన్, పృద్వి రాజ్ గా రానా కనిపించబోతున్నారు. వారికున్న ఈగో కారణముగా హీరోల కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడతాయి.. తమకున్న ఈగో వలన భార్యల పరిస్థితి ఏమిటి, అలాగే పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ ని రెచ్చెగొట్టే విధంగా రానా కేరెక్టర్ ని డిజైన్ చేశారట.
ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఓ ఫ్లాష్ బ్యాక్ జోడించారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో అలాగే మిగతా సినిమాలో అన్ని కలిసి నాలుగు అదిరిపోయే ఫైట్స్ ఉంటాయట. ఆ యాక్షన్ సీక్వెన్స్ చూసాక ప్రేక్షకులు పవన్ కి రానా కి అంత ఈగో ఎందుకు కాస్త తగ్గొచ్చు కదా అనేలా ఉంటాయట అవి.