Advertisementt

కోట్లు పోసి కారు కొన్న పవన్

Wed 30th Jun 2021 06:46 PM
pawan kalyan,pawan,new car,luxury range rover suv,pawan kalyan buys a costly suv  కోట్లు పోసి కారు కొన్న పవన్
Pawan Kalyan buys a costly SUV కోట్లు పోసి కారు కొన్న పవన్
Advertisement
Ads by CJ

చాలా సాదా సీదా గా సింపుల్ గా ఉంటారు పవన్ కళ్యాణ్. ఆయన కి డబ్బు సంపాదించాలని లేకపోయినా.. రాజకీయాల కోసం మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండాలని, ఎక్కడో ఒక ఆశ్రమంలో మునిలా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరిక. కానీ మీరు ఇక్కడే అభిమానుల మధ్యనే కొన్నాళ్ళు ఉండాలని ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ చెప్పారట. ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే తన పశుసంపద మధ్యన, తోటల మధ్యన గడిపేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడికొక కాస్ట్లీ కారు కొన్నారట. తన లైఫ్ లోనే పవన్ కళ్యాణ్ అంత బడ్జెట్ పెట్టి కారు కొన్నట్లుగా చెబుతున్నారు. 

వకీల్ సాబ్ కి 50 కోట్లు అందుకున్నారని టాక్ ఉన్నా.. పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల విషయంలోనూ పారితోషకంలో ఎక్కడా తగ్గలేదట. సో ఆ వచ్చిన డబ్బుతోనే పవన్ అంతటి ధర పెట్టి కారుని కొనేశారట. చాలా కొద్దిమంది సెలబ్రిటీస్ దగ్గర ఉండే ఆ కారు దేశంలోనే అత్యంత విలువైనది. అదే లగ్జరీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ కారు ఇప్పుడు పవన్ కొన్నారట. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ యొక్క ఆటోబయోగ్రఫీ మోడల్ కారును పవన్ కళ్యాణ్ పేరు మీద బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. 

మరి సాదా సీదా గా ఉండే పవన్ ఇంత రేటు పెట్టి కారు కొనేసరికి అందరూ ఇప్పుడు పవన్ కారు గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన పెద్దగా ఇల్లు, కార్లు కొన్న దాఖలాలు లేవు. కొన్నా ఇంతటి కాస్ట్లీ కారుని ఎప్పుడు కొనలేదు. సో అందుకే పవన్ కారు విషయం ఇప్పుడు అంత హాట్ టాపిక్ అయ్యింది. 

Pawan Kalyan buys a costly SUV:

Pawan Kalyan is soon going to be the owner of a luxury Range Rover SUV

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ