టాలీవుడ్ లో గీత గోవిందం సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన విజయ్ దేవరకొండ - రష్మిక లు ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వారి మధ్యన ఏదో ఉంది అంటూ ప్రచారం జరగడం మా మధ్యన ఏం లేదని వీరు చెప్పడం కామన్ అయ్యింది. ఎందుకంటే వీరిద్దరి ఎవరి సినిమాల్లో వారు బిజీగా వున్నా తరుచూ కలుస్తుంటారు. అది చూసిన వారు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. తాజాగా విజయ్ నా ఫ్రెండ్ అంటూ అభిమానుల చిట్ చాట్ లో చెప్పిన రష్మిక.. తన భర్తకు ఉండవల్సిన లక్షణాలు ఎలా ఉండాలో అనేది రివీల్ చేసేసింది.
ఓ అభిమాని మిమ్మల్ని మెప్పించాలంటే ఎలాంటి పనులు చెయ్యాలి అని అడగగా.. నాకు స్మోక్ చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. కనీసం వాళ్ళ దగ్గరగా కూడా ఉండను. ఇక మీ భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమేమేం ఉండాలి అని అడిగితె.. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలని రష్మిక చెప్పింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా కనిపించాలని చెప్పుకొచ్చింది.
మరి ఇదే రష్మిక గతంలో తమిళ్ రుచులు బావుంటాయి.. అక్కడి వంటలంటే చాలా ఇష్టం.. నాకు తమిళుల ఇంటికి కోడలిగా వెళ్లాలని ఉంది అని చెప్పేసరికి రష్మికని కోలీవుడ్ కోడలు అంటూ పిలవడం మొదలు పెట్టేసారు,. ఇక ఇప్పుడు రష్మిక తనకు కాబోయే భర్త చాలా సింపుల్ గా ఉండాలి అని చెబుతుంది.